కొమల సేవాసదన్

కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సేవాకార్యక్రమాలకు శాశ్విత కేంద్ర బిందువు గా వీరన్నపాలెం లో నిర్మించే ' కొమల సేవాసదన్' ఉంటుంది. ట్రస్ట్ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవాసదన్ నిరంతరం పనిచేస్తుంది. ట్రస్టు చేపట్టే బహుముఖ సేవాకార్యక్రమాలకు ఇది వేదికగా ఉంటుంది. 
సేవాసదన్ నిర్మాణంలో కొమల ట్రస్ట్ వారి ముఖ్య ఉద్దేశాలు : 
1. గ్రామ ప్రజల శుభాశుభ అవసరాలకు కావలిసిన సామాజక భవనం /కళ్యాణ మండపాన్ని ముఖ్య భాగంగా, ఇతర సేవా కార్యక్రమాలకు అనువు గా ఈ శాశ్విత  భవనం నిర్మించటం 
2. వివేకవంతమైన విద్య, వ్యక్తిత్త్వవికాసానికి, జీవనోపాధికి ఉపయోగపడే సాంకేతిక, నైపుణ్య విద్యా, వ్యవసాయ శిక్షణా తరగతులను నిర్వహించటం 
3. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటులో అవసరమైన వైద్యశిభిరాలు ఏర్పాటు, ప్రాధమిక వైద్యశాల కు వసతి/నిర్వహించుట. 
4. సాహిత్య, వినోద కళా సంస్కృతులను ప్రోత్సహించే కార్యక్రమాలను, యువతలో చైతన్యం కలిగించే ఆలోచనాత్మక /మానవీయ/ నైతిక విలువలను ప్రోత్సహించేలా వ్యక్తిత్త్వ వికాస ప్రసంగాలు/ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం.
5. గ్రామం వదిలి వెళ్లిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనాలకు,వేడుకలకు/పరిచయాలకు వసతి/వేదికగా ఉండటం. జన్మ భూమితో/ కన్నవారితో పేగు బంధాన్ని పది కాలాలపాటు కలసి ఉండేలా వారధి ఏర్పరచటం. 
6. యోగ, క్రీడా, జిమ్ వంటి వాటికి వసతులు కల్పించటం. సమష్టి భావన తో గ్రామ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్ర వీరన్నపాలెం కొరకు కృషి చేయటం.

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం