ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్

వీరన్న పాలెం గ్రామం లో ది.10-2-2019 న "ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సు జరింగింది. ఈ అవగాహన  సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు,మై ప్లాస్టిక్ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కె . ప్రసాద్ గారు  సమాజం పై చూపుతున్న ప్రభావాన్ని చక్కగా గ్రామస్తులకు   వివరించారు.  ఇంటిలో రోజువారీ వాడకంలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో వేసి వారానికి ఒక రోజు వాటిని గ్రామం లో నిర్దేశించిన ప్రదేశంలో వేసిన వాటిని అక్కడినుండి తాము తరలించి వాటిని రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కొమల ట్రస్ట్ చైర్మన్ కొడాలిశ్రీనివాస్ ప్రసంగిస్తూ ఇంటిలో వచ్చే వ్యర్థాలతో రెండు రకాలని , కుళ్లిపోయి భూమిలో కలిసే పోయే వ్యర్థాలను ఎరువులుగా వాడి భూమిని సారవంతం చేసుకోవచ్చని వాటికొరకు పంచాయితీ వారి సహకారం తో డంప్ యార్డును నిర్వహించుకోవాలని దానికి తగిన సహాయ సహకారాలను తమ ట్రస్టు ద్వారా అందజేయగమని తెలిపారు. గ్రామ పరిశుభ్రత కొరకు అందరికి అవగాహన కలిగించటానికి విద్యార్థుల సహకారంఓతో గ్రామంలో ప్రతి ఇంటికి ఒక కరపత్రాన్ని, ఒక చేతి సంచిని పంచిన  స్వచ్చంద కార్యకర్త శ్రీమతి కొల్లా రత్నకుమారి మాట్లాడుతూ ఈ మంచి పనికి ప్రతిఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత వాసవి క్లబ్ వారు కొమల ట్రస్ట్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ గారిని, రత్న కుమారి ని సత్కరించారు. ఈ సదస్సు లో ట్రస్టు సభ్యులు శ్రీమతి రాఘిని , గోరంట్ల రాఘవేంద్రరావు తోపాటు గ్రామస్థులు పాల్గొన్నారు. 

కొల్లా రత్న కుమారిని సత్కరిస్తున్న వాసవి క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ గారు
కొడాలి శ్రీనివాస్ గారిని సత్కరిస్తున్న వాసవి క్లబ్ సభ్యులు 

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం