Posts

చేతి సంచికి స్వాగతం

Image
  చేతి సంచిని స్వాగతించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 

విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు

Image
ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్ఞాపకార్థం (1926-2017) వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది. దీనిలో భాగంగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఆగష్టు 15, 2019 న చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందించబడ్డాయి. వీటితోపాటు 10 వ తరగతి పబ్లిక్ పరిక్షలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మానికొండ శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ముత్తాత,తాతమ్మ పాపయ్య,వీరమ్మ తాత నాయనమ్మ పోతురాజు, సీతమ్మ తండ్రి వెంకటేశ్వర్లు, చెల్లి జ్యోతి ల జ్ఞాపకార్థం నగదు బహుమతులు ఇచ్చారు. తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు శ్రీ దగ్గుపాటి శ్రీనివాసరావు సౌజన్యం తో నగదు బ...

ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ

Image
వీరన్న పాలెం గ్రామం లో మై ప్లాస్టిక్ కార్యక్రమం లో ప్రధాన భాగమైన ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ 5-03-2019 న కొమల ట్రస్ట్ వారి సహకారంతో దిగ్విజయంగా జరిగింది. ఇంతకు ముందు ది.10-2-2019 న " ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించిన సంగతి విదితమే. ఆనాడు గ్రామవాసులకు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించి వారి ఇంటిలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో ఉంచి దాన్ని ఒక నిర్దిష్టమైన రోజున అందజేయాలని కోరటం, దానికి స్పందనగా నేడు వారి నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను (పొడి చెత్త) సేకరించారు.  ఈ కార్యక్రమంలో కొమల ట్రస్ట్ తరుపున శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు, శ్రీమతి కొల్లా రత్నకుమారి, చిలకలూరిపేట వాసవి క్లబ్ తరుపున అధ్యక్షులు శ్రీ కె ప్రసాద్ గారు పాల్గొన్నారు .   ఈ సందర్భంగా గ్రామపంచాయితీ సహకారంతో ప్రతి ఇంటికి తడి చెత్తకు ఒకటి ,పొడి చెత్తకి (ప్లాస్టిక్ వ్యర్థాలకు) ఒకటి  చొప్పున రెండు సేకరణ బుట్టలు ఇచ్చారు.  పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్ట...

వృక్షో రక్షిత రక్షతః

Image
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి,ప్రాణ వాయువును అందించి  పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను నాటటం,  పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. పరిశుభ్రత -పచ్చదనం కొరకు కృషి  చేద్దాం.  వృక్షో రక్షిత  రక్ష తః -- చెట్లను కాపాడండి అవి మనలను కాపాడుతాయి  ఈ సదుద్దేశంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరన్నపాలెం గ్రామం లో  ది . 4-03-2019 న చెట్లను పెంచే హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా  గ్రామానికి త్రాగు నీటిని అందించే చెరువు చుట్టూ మొక్కలు నాటి వాటిని పశువుల నుండి కాపాడటాని...

ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్

Image
వీరన్న పాలెం గ్రామం లో ది.10-2-2019 న "ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సు జరింగింది. ఈ అవగాహన  సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు,మై ప్లాస్టిక్ కార్యక్రమ నిర్వాహకులు  శ్రీ కె . ప్రసాద్ గారు  సమాజం పై చూపుతున్న ప్రభావాన్ని చక్కగా గ్రామస్తులకు   వివరించారు.  ఇంటిలో రోజువారీ వాడకంలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో వేసి వారానికి ఒక రోజు వాటిని గ్రామం లో నిర్దేశించిన ప్రదేశంలో వేసిన వాటిని అక్కడినుండి తాము తరలించి వాటిని రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కొమల ట్రస్ట్ చైర్మన్ కొడాలిశ్రీనివాస్ ప్రసంగిస్తూ ఇంటిలో వచ్చే వ్యర్థాలతో రెండు రకాలని , కుళ్లిపోయి భూమిలో కలిసే పోయే వ్యర్థాలను ఎరువులుగా వాడి భూమిని సారవంతం చేసుకోవచ్చని వాటికొరకు పంచాయితీ వారి సహకారం తో డంప్ యార్డును నిర్వహించుకోవాలని దానికి తగిన సహాయ సహకారాలను తమ ట్రస్టు ద్వారా అందజేయగమని తెలిపారు. గ్రామ పరిశుభ్రత కొరకు అందరికి అవగాహన కలిగించటానికి విద్యార్థుల సహకార...

సేవా సదనం కు శంకు స్థాపన

Image
కొడాలి మల్లిఖార్జునరావు లక్ష్మి దేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో 1.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ బడుతున్న  సేవా సదనం  కు 9-02-2019 న ఉదయం 8. 52 ని లకు (శనివారం)  శంకు స్థాపన పక్రియ అత్యంత వైభవంగా జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు కొడాలి శ్రీనివాస్ రాఘిని దంపతులు చేతులు మీదుగా శాస్త్రీయంగా భూమిపూజ,శంకుస్థాపన ప్రదమేష్ఠికావిన్యాసం, నవగ్రహ వాస్తు శాంతి యాగం చేశారు. ఈ కార్యక్రమం లో ట్రస్టు సభ్యులు గోరంట్ల రాఘవేంద్రరావు , లతా మంజరి , కొడాలి వినయ్ కుమార్ తో పాటు పర్చూరు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చిట్టినేని రామకృష్ణ, గ్రామ సర్పంచ్ శేఖర్ బాబు తో పాటు అనేక మంది గ్రామ పెద్దలు, మిత్రులు పాల్గొని కార్యకమాన్ని విజయవంతం చేశారు. 

కొమల సేవాసదనాన్ని సందర్శించిన శాసన సభ సభ్యులు శ్రీ ఏలూరి

Image
పర్చూరు శాసన సభ సభ్యులు శ్రీ ఏలూరి సాంబ శివ రావు గారు పిబ్రవరి 3 ,2019 న వీరన్నపాలెం లో కొమల ట్రస్ట్ వారు నిర్మంచే 'సేవా సదనం' ప్రదేశాన్ని సందర్శించారు.  కొమలట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలను తెలుసుకొని వాటికి కావలిసిన సహకారం అందించగలనని తెలిపారు. ది 9-02-2018 న సేవాసదనం శంఖుస్థాపన కార్యక్రంలో పాల్గొన గలనని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో ట్రస్టు సభ్యులు కొడాలి శ్రీనివాస్, శ్రీమతి రాఘిని, గోరంట్ల రాఘవేంద్రరావు,శ్రీమతి లతామంజరి, శ్రీమతి కొడాలి సుజాత  లతో పాటు గ్రామ సర్పంచ్ మక్కెన శేఖర్ ,మార్కెట్ యార్డ్ చైర్మన్ చిట్టినేని రామకృష్ణ, శ్రీమతి కొల్లా రత్న కుమారి తో పాటు అనేక మంది పాల్గొన్న వారిలో ఉన్నారు.