Posts

Showing posts from February, 2017

జీవితం చేజారనీయకు

Image
ఆపిల్ కంపెనీ సృష్టికర్త,ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు  వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది . ఈ నిశిరాత్రిలో ... నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడనిపిస్తోంది... జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక, మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ .......... ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది . కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది . అందుకు నేనే ఉదాహరణ . ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగ...