Posts

Showing posts from July, 2020

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

Image
ప్రజా వైద్యుడు .సత్తెనపల్లి పరిసర ప్రజలకు దాదాపు నాలుగు దశాబ్దాలు విశేష వైద్య సేవలు అందించిన మానవతావాది ఆదర్శమూర్తి డాక్టర్ కొడాలి రంగారావు. డాక్టర్ రంగారావు గారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో కొడాలి వెంకట్రామయ్య, లక్ష్మి నరసమ్మ దంపతులకు 1938 ఏప్రిల్ 22న జన్మించారు. వీరికి గోపాల కృష్ణయ్య, మల్లిఖార్జున రావు అనే ఇద్దరు అన్నలు,ధన లక్ష్మీ అనే అక్కయ్య ఉన్నారు. రంగారావు గారి హైస్కూల్ విద్య తురిమెళ్ళ లోను,PUC గుంటూరు హిందూ కాలేజీ లోను, వైద్య విద్య MBBS ను మణిపాల్ కే.ఎం.సి కళాశాల లో చదివారు. 1961 లో తన సోదరి గోగినేని ధనలక్ష్మి,దేవయ్య గార్ల కుమార్తె ఉమాదేవిని వివాహం చేసుకున్నారు. వామ పక్ష భావాలు గల రంగారావు గారు రోగుల పట్ల చాలా ఉదారంగా ఉండేవారు. తొలుత తెనాలిలో డాక్టర్ కుర్రా వీరరాఘవయ్య, డాక్టర్ కొడాలి వీరయ్య చౌదరి గార్ల వద్ద కొద్ది కాలం వైద్యునిగా పనిచేసి నైపుణ్యం గడించారు. ఆ తరువాత   వైద్య సదుపాయాలు ఏమాత్రం లేని గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి అనే గ్రామీణ ప్రాతంలో 1962 లో తొలి ప్రజా వైద్య శాల "నాగార్జున నర్సింగ్ హోమ్" ను స్థాపించి వెనకబడిన పలనాటి గ్రామీణ

హరిత హారం

Image
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ,ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను విరివిగా పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. స్వచ్ఛ వీరన్నపాలెం కార్యక్రమం లో భాగంగా పచ్చదనం కొరకు వీరన్నపాలెం గ్రామంలో చెట్లను పెంచే కార్యక్రమాన్నికొమల ట్రస్ట్  చేపట్టింది. దీనిలో భాగంగా ఆత్మీయుల  పుట్టిన రోజు / జయంతి, వర్థంతి,పెళ్లి రోజు వంటి విశిష్ట శుభ దినాలలో వారి పేరుతో  ఒక చెట్టును నాటి దానిని   పెంచి పోషించటానికి  దాతల నుండి ట్రస్టు విరాళం సేకరించి వారిని హరిత హారం   కార్యక్రమంలో  భాగస్వాములుగా చేసే ఒక బృహత్తర పనికి కొమల ట్రస్ట్ 26-06- 2020న నాంది పలికింది.  కొమల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొడాలి శ్ర