హరిత హారం
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ,ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను విరివిగా పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. స్వచ్ఛ వీరన్నపాలెం కార్యక్రమం లో భాగంగా పచ్చదనం కొరకు వీరన్నపాలెం గ్రామంలో చెట్లను పెంచే కార్యక్రమాన్నికొమల ట్రస్ట్ చేపట్టింది.
దీనిలో భాగంగా ఆత్మీయుల పుట్టిన రోజు / జయంతి, వర్థంతి,పెళ్లి రోజు వంటి విశిష్ట శుభ దినాలలో వారి పేరుతో ఒక చెట్టును నాటి దానిని పెంచి పోషించటానికి దాతల నుండి ట్రస్టు విరాళం సేకరించి వారిని హరిత హారం కార్యక్రమంలో భాగస్వాములుగా చేసే ఒక బృహత్తర పనికి కొమల ట్రస్ట్ 26-06- 2020న నాంది పలికింది.
వీరన్నపాలెం గ్రామం కు హరిత హారంగా రూపొందేలా ప్రభుత్వ మరియు దాతలు , స్వచ్చంద సేవకుల సహాయ సహకారాలతో ఈ మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగేలా కృషి చేస్తామని ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు శ్రీమతి కొల్లా రత్న కుమారి తెలిపారు. ప్రకృతిని పరిరక్షించే ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతివారు తమ జన్మదిన కానుక గా చేయూత ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు.
కొమల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొడాలి శ్రీనివాస్, మరియు వారి మనుమడు కొడాలి సుధీర, మండవ లోకేష్ ల కుమారుడు చి. అశ్వత్ రామ్ పుట్టినరోజు జూన్ 26 న వారి ప్రోత్సాహం తో మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టాం. ఈ కార్యక్రమంలో చి. కొడాలి శ్రేష్ఠ మూడవ పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు గుర్తుగా శ్రీ కొడాలి వినయ్ కుమార్, శ్రీమతి మౌనిక దంపతులు రెండు మొక్కలు బహుమతిగా ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేశవరపాడు (కొడాలివారి పాలెం) గ్రామస్థులు శ్రీ వెనిగండ్ల కోటేశ్వరరావు, మరియు వారి మనుమడు చి. వెనిగండ్ల జస్వంత్ సాయి పుట్టిన రోజు బహుమతిగా రెండు మొక్కలను బహుమతిగా ఇచ్చారు. వీరికి కొమల ట్రస్ట్ అభినందనలు తెలుపుతుంది
చి. మండవ అశ్వత్ రామ్ |
చి. కొడాలి శ్రేష్ఠ |
దాత : శ్రీ కొడాలి వినయ్ కుమార్, శ్రీమతి మౌనిక |
దాత : శ్రీ వెనిగండ్ల కోటేశ్వరరావు |
దాత :చి. వెనిగండ్ల జస్వంత్ సాయి |
వీరన్నపాలెం గ్రామం కు హరిత హారంగా రూపొందేలా ప్రభుత్వ మరియు దాతలు , స్వచ్చంద సేవకుల సహాయ సహకారాలతో ఈ మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగేలా కృషి చేస్తామని ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు శ్రీమతి కొల్లా రత్న కుమారి తెలిపారు. ప్రకృతిని పరిరక్షించే ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతివారు తమ జన్మదిన కానుక గా చేయూత ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు.
వివరాలకు
శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు -9010886406
శ్రీమతి కొల్లా రత్న కుమారి - 7660967956
Comments
Post a Comment