Posts

Showing posts from October, 2019

బంధాలూ - భాద్యతలు

Image
మీ పిల్లలు మీ సొంతం అనుకోకండి  వాళ్ళు మీ  జీవితేచ్చకు  జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే  ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా                                                                                                                                                         ..ఖలీల్ జిబ్రాన్

దాన గుణం

Image
దాతవ్యం భోక్తవ్యం సతివిభవే సంగ్రహే న కర్తవ్య:! పశ్యేహం మధుకరీణ సంచితమర్ధం హరిష్యన్తే !! One should spend his/her wealth either by giving it as charity, or at least for his own consumption. A person's duty is not to earn wealth just for the sake of accumulation. The same lesson can be learnt from the fate of honey bees, whose collection of honey is plundered by others. వేమన శతకంలో వేమన కూడా లోభి గురించి ఈ విధంగా వర్ణించాడు, ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగ తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వధాభిరామ వినురవేమ. తాత్పర్యం : బాగా ధనము కలిగిన పిసినారి ఆ ధనమును ఇతరులకు ధాన ధర్మములు చేయక, తాను కూడా తినక, అనుభవించక వాటిని చూసుకుంటూ జీవతం గడిపేసి చివరికి చనిపోతాడు. తేనెటీగ కూడ ఎంతో కష్టపడి పూలలోని మకరంధాన్ని తెచ్చి తేనెను తయారు చేసి అవి తాగకుండా పరుల పాలు చేస్తాయి. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన సంపదను దానం చేయటంలోనో లేక తన అవసరాలకు వినియోగించటంలోనో ఖర్చు పెట్టాలి.  అంతేకాని సంపదను కూడబెట్టానికి మాత్రమే అనుకోవటం సరైన ఆలోచన కాదు. తేనెటీగలు అహర్నిశం క

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

Image
మాకునిరంతరం  స్ఫూర్తిని కలిగించే కర్మ యోగి  కీ. శే. కొడాలి  మల్లిఖార్జునరావు  గారి 4వ   వర్ధంతి (14-10-2019)  కొమల ట్రస్ట్ వారు ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. ఈ చతుర్ధ వర్దంతి సందర్భంగా వారి ఆశయ సిద్ధి కొరకు  కొమల  చారిటబుల్ ట్రస్ట్  శ్రాయశక్తులా పాటుపడుతుందని తెలియజేస్తున్నాం . అనివార్య కారణాల చేత ప్రారంభం కానీ సేవాసదనం నిర్మాణపనులు త్వరలో మొదలవుతాయని తెలియజేయటానికి సంతోషిస్తున్నాము. 

కర్మ యోగి మల్లిఖార్జున రావు-5

Image
స్ఫూర్తి ప్రధాత -5 విశ్వాసం వివిధరకాలుగా దర్శనమిస్తుంది. దైవిక భావ నమ్మికలలో అద్భుతాలు, అతీత శక్తుల పాత్ర కూడా ఒకటి. సహజంగా ఒక వ్యక్తి తనను తాను దైవంశ భూతునిగా పరిగణించుకునే క్రమంలో ఇవి ప్రధాన భూమికగా ఉంటాయి. వీటిలో చాలావరకు అవాస్తవాలు గాను మిగిలినవి అతిశయోక్తులుగాను ఉంటాయి. అయితే వాటిని వాస్తవాలుగా, దైవలీలలుగా ప్రచారం చేసే ఒక ప్రాయోజిత వర్గం ఉంటుంది. ఏపుట్టలో ఏముందో అనే వాదనతో నమ్మితే నష్టం లేదన్నట్లుగా జరిగే ప్రచారంలో అనేకమంది అమాయకులు ఆకర్షించబడుతారు. దైవబలం తో పాటు గ్రహబలం, గృహబలం అంటూ రకరకాల నమ్మికలు కూడా చోటు చేసుకుంటాయి. అదృష్టానికి వీటి అందండలు ఉంటాయని అందరిలా మల్లిఖార్జునరావు కూడా భావించేవారు.  స్వతాహా హేతుబద్ధ ఆలోచన, ఆచరణ ఉన్న మల్లిఖార్జున రావు లో కూడా కొంతకాలం ఈ  ఆకర్షణలకు భ్రమలకు లోనై వాటిని నమ్మి ఆచరించాడు. జ్యోతిష్యాలు, హస్త రేఖలు , మహిమలు నిజమని తలచేవారు. తరుచూ  లాటరీ టిక్కెట్లు కొని లక్కు లేదని నిరుత్సాహ పడేవారు.  1996 లో వాస్తులో ఏముంది? అనే పుస్తకంలో ఉన్న చిత్రం  కొన్ని సంఘటనలు భవిషత్తులో సమాజ శ్రేయస్సుకు దారిచూపేగా ఉంటాయి అన్న దానికి ఒక మంచి ఉదాహార