Posts

Showing posts from March, 2024

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 3

Image
3.1  గ్రామ వృక్షాలు              గ్రామ నిర్మాణంలో బొడ్డురాయి కూడలి తరువాత మరో ప్రధానమైన సంగమ స్థానం పడమర బజారు, బొడ్డురాయి బజారు రెండు కలిసే కూడలి.  ఒక నాడు ఈ కూడలిలో శ్రీ మహాలక్ష్మీ దేవి  అంశగా పూజలు అందుకొనే పెద్ద వేప చెట్టు ఉండేది. ప్రతి శుభకార్యం జరుగుతున్నప్పుడు ఇక్కడన్న వేప చెట్టుని  పసుపు కుంకుమలతో పూజించేవారు. పకృతి ఆరాధనలో వృక్షారాధన ఒకటి. చల్లటి నీడను, ఆరోగ్యకరమైన గాలిని ప్రసాదించే వేప చెట్టు అమ్మ తల్లిగా భావించేవారు. ఇప్పుడు అక్కడ వేప చెట్టు కనుమరుగైంది. అయినా కానీ ఇప్పటికి గ్రామ జనులు పెండ్లి వంటి శుభకార్యక్రమాలు జరుపుకునే సమయంలో ఆ కూడలిలో(వీధి మధ్యలో) ఒక వేప కొమ్మని మట్టి ముద్దలో నాటి దానినే శ్రీ మహాలక్ష్మీ దేవిగా తలుస్తూ పూజలు చేస్తున్నారు. కుదించుకుపోయిన ఆ ప్రదేశంలో కొత్తగా మరో చెట్టు నాటే వెసులుబాటు నేడు లేదు. కాలగతిలో ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో బలంగా ఏళ్ళూనుకొని ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు ఏదో రకంగా ఆనాలోచనతో కొనసాగుతాయని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.            ఈ పడమటి కూడలికి నైరుతి దిశలో విష్ణువాలయం నిర్మించాలని 'మానసారం' లో చెప్పబడింది.  ఈ సూత

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2

Image
 2. 1  గ్రామ నిర్మాణం            దండక నామ గ్రామ ప్రణాళిక  (మానసారం)           వీరన్నపాలెం గ్రామ నిర్మాణం ప్రాచీన గ్రామ వాస్తును అనుసరిస్తూ నిర్మించబడినది. ఇది మానససారం అనే ప్రాచీన వాస్తు గ్రంథం లో చెప్పబడిన "దండక నామ గ్రామం" ను ప్రామాణికంగా తీసుకోని నిర్మించుకున్నారు.  మాయ మతం, శిల్ప రత్నం వంటి వాస్తు గ్రంథాలలోను దండకా నమ గ్రామ నిర్మాణం గురించిన వివరాలు ఉన్నాయి. ఈ గ్రామం ఆయతాకారం (దీర్ఘ చతురస్రాకారం) లో ఉండి వ్యవసాయం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రామంలో గరిష్టంగా ఒక వంద కుటుంబాలు నివసించవచ్చు. దీని ప్రణాళిక ప్రకారం తూర్పు - పడమర దిశలకు తిన్నగా ఒక ప్రధాన వీథి (సూర్య వీథి), దానికి లంబకోణంలో ఉత్తర - దక్షిణ దిశలకు ఉండే మూడు వీథులు  (చంద్ర వీథులు) ఉంటాయి. ఈ నాలుగు వీథులును అనుసంధానం చేస్తూ గ్రామ వెలుపల ఒక వీథి ఉంటుంది. దీనిని మంగళా వీథి (చుట్టు వీథి / రింగ్ రోడ్డు) అని అంటారు.  ఇది వీరన్న పాలెం ప్రాథమిక దశలో రూపొందించిన ప్రణాళిక.  2.2  ప్రధాన వీథులు             ఇప్పుడు బొడ్డు రాయి ఉన్న ప్రదేశంలో తూర్పు - పడమర దిశలకు నిలువుగా  ఉన్నది గ్రామ ప్రధాన వీథి లేదా రాజవీథిగా చెప్పవచ్చు

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 1

Image
1. గ్రామ ప్రాచీన చరిత్ర   ఈనాడు బాపట్ల జిల్లా పరుచూరు మండలంలో ఉన్న ఈ వీరన్న పాలెం ఉన్న ప్రాంతాన్ని ఒకనాడు తెలుగు చోడ, పలనాటి హైహయ రాజవంశాలు , కాకతీయ సామ్రాట్టులు, అద్దంకి రెడ్డి రాజులు, ఓఢ్ర గజపతులు, విజయనగర సామ్రాట్టులు పరిపాలించారు. రాక్షస తంగడి యుద్ధం తరువాత యీ సీమ కుతుబ్ షాహీలు, మొగలాయిలు, అసఫ్ జాహీల ఏలుబడిలో ఉండేది. అసఫ్ జాహీ (నిజాం రాజు) పాలన నుంచి సా.శ. 1788 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి  ఈ ప్రాంతం బదలాయింపైనది. సా.శ.1858 లో పాలన కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొని మన దేశం వారి సామ్రాజ్యంలో భాగమయింది. ఈ కాలంలో మన ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థ చాలా మార్పులు చెందింది. అసఫ్ జాహీల, పిమ్మట ఈస్టిండియా కంపెనీ/ బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో స్థానిక పాలకులు జమీందారీ వ్యవస్థ ద్వారా స్థిరపడ్డారు. గోర్డెన్ మాకెన్ జి  వ్రాసిన  'కృష్ణా జిల్లా మ్యాన్యువల్ (1883)' ప్రకారం ఈ ప్రాంతం 1873 వరకు వేంకటగిరి జమీందార్ల ఆధీనంలో ఉంది. ఆ తరువాత బ్రిటీష్ వారి పాలనలో కృష్ణ జిల్లాలో భాగంగా ఉంటూ 1904లో గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలో భాగమైంది. 1970 లో బాపట్ల తాలూకా నుండి విభజించబడి నూతనంగా ఏర్పడిన ప్