Posts

Showing posts from March, 2019

ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ

Image
వీరన్న పాలెం గ్రామం లో మై ప్లాస్టిక్ కార్యక్రమం లో ప్రధాన భాగమైన ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ 5-03-2019 న కొమల ట్రస్ట్ వారి సహకారంతో దిగ్విజయంగా జరిగింది. ఇంతకు ముందు ది.10-2-2019 న " ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించిన సంగతి విదితమే. ఆనాడు గ్రామవాసులకు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించి వారి ఇంటిలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో ఉంచి దాన్ని ఒక నిర్దిష్టమైన రోజున అందజేయాలని కోరటం, దానికి స్పందనగా నేడు వారి నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను (పొడి చెత్త) సేకరించారు.  ఈ కార్యక్రమంలో కొమల ట్రస్ట్ తరుపున శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు, శ్రీమతి కొల్లా రత్నకుమారి, చిలకలూరిపేట వాసవి క్లబ్ తరుపున అధ్యక్షులు శ్రీ కె ప్రసాద్ గారు పాల్గొన్నారు .   ఈ సందర్భంగా గ్రామపంచాయితీ సహకారంతో ప్రతి ఇంటికి తడి చెత్తకు ఒకటి ,పొడి చెత్తకి (ప్లాస్టిక్ వ్యర్థాలకు) ఒకటి  చొప్పున రెండు సేకరణ బుట్టలు ఇచ్చారు.  పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాల  సేకరణ

వృక్షో రక్షిత రక్షతః

Image
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి,ప్రాణ వాయువును అందించి  పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను నాటటం,  పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. పరిశుభ్రత -పచ్చదనం కొరకు కృషి  చేద్దాం.  వృక్షో రక్షిత  రక్ష తః -- చెట్లను కాపాడండి అవి మనలను కాపాడుతాయి  ఈ సదుద్దేశంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరన్నపాలెం గ్రామం లో  ది . 4-03-2019 న చెట్లను పెంచే హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా  గ్రామానికి త్రాగు నీటిని అందించే చెరువు చుట్టూ మొక్కలు నాటి వాటిని పశువుల నుండి కాపాడటానికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ