ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ
వీరన్న పాలెం గ్రామం లో మై ప్లాస్టిక్ కార్యక్రమం లో ప్రధాన భాగమైన ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ 5-03-2019 న కొమల ట్రస్ట్ వారి సహకారంతో దిగ్విజయంగా జరిగింది. ఇంతకు ముందు ది.10-2-2019 న "ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించిన సంగతి విదితమే. ఆనాడు గ్రామవాసులకు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను వివరించి వారి ఇంటిలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో ఉంచి దాన్ని ఒక నిర్దిష్టమైన రోజున అందజేయాలని కోరటం, దానికి స్పందనగా నేడు వారి నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను (పొడి చెత్త) సేకరించారు.
ఈ కార్యక్రమంలో కొమల ట్రస్ట్ తరుపున శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు, శ్రీమతి కొల్లా రత్నకుమారి, చిలకలూరిపేట వాసవి క్లబ్ తరుపున అధ్యక్షులు శ్రీ కె ప్రసాద్ గారు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా గ్రామపంచాయితీ సహకారంతో ప్రతి ఇంటికి తడి చెత్తకు ఒకటి ,పొడి చెత్తకి (ప్లాస్టిక్ వ్యర్థాలకు) ఒకటి చొప్పున రెండు సేకరణ బుట్టలు ఇచ్చారు.
పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు సహకరించిన వారినందరిని అభినందించిన ప్రసాద్ గారు వారిచే ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరిస్తామని ప్రమాణం చేయించారు. కొల్లా రత్న కుమారి మాట్లాడుతూ గ్రామస్థులకు, ముఖ్యంగా ఇంటిలో ఉండే గృహిణులకు ఈ ప్లాస్టిక్ సేకరణలో ప్రేరణ కల్గించాలని విద్యార్థులను కోరారు. ఆ తరువాత ప్లాస్టిక్ వ్యర్థాలను చీరాల డంప్ యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొసాగించాలని దానికి తమవంతు సహాయ సహకారాలను అందించగలమని కొమల ట్రస్ట్ తరుపున గోరంట్ల రాఘవేంద్రరావు తెలిపారు.
Comments
Post a Comment