Posts

Showing posts from June, 2018

అక్షయ పాత్ర

Image
అన్ని దానాలలో అన్నదానం శ్రేష్టం అయితే విద్యాదానం కూడా అంతే శ్రేష్టం అనుటలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ఒక దానాన్ని మరొక దానం తో కలిపి దేశంలో అమలు చేస్తున్నది అక్షయ పాత్ర ఫౌండేషన్. అన్నం, విద్య  ఈ రెండు దానాలను అర్హులకు అందజేయటమే అక్షయ పాత్ర ఫాండషన్ అసలైన లక్ష్యం. అపాత్ర దానం అనర్ధ హేతువు.  మధ్యాహాన్నం పాఠశాలల్లో పేద విద్యార్థులకు భోజనం కల్పించి వారిని విద్యకు చేరువ చేయటానికి ఈ పధకానికి రూపకల్పన చేశారు. అక్షయ పాత్ర పధకంలో వదాన్యులు ఎవరైనా విరాళాలు ఇచ్చి భాగస్వాములు కావచ్చు. 950 రూపాయల విరాళం తో ఒక విద్యార్థికి ఒక ఏడాది పాటు మధ్యాన్నం ఆకలిని తీర్చవచ్చు.   శ్రీమతి కొడాలి లక్ష్మీదేవమ్మ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా 1-06-2018న  కొమల ట్రస్టు వారు  అక్షయపాత్ర పేరుతో విద్యాన్నదానం చేయటాన్ని స్ఫూర్తి గా తీసుకుంది. విద్యాన్నాదానం వంటి  మహోన్నతమైన కార్యక్రమం చేపట్టిన అక్షయపాత్ర ఫాండషన్ బెంగుళూరు వారికి అభినందలు తెలియజేస్తూ ఆ కార్యక్రమం లో ఉడుతాభక్తిగా "కొమల  చారిటబుల్ ట్రస్ట్ "కూడా తన వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకుంది.  ట్రస్ట్ స్ఫూర్తి దాతలు కీర్తి శేషులు  కొడాలి