వృక్షో రక్షిత రక్షతః
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి,ప్రాణ వాయువును అందించి పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను నాటటం, పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. పరిశుభ్రత -పచ్చదనం కొరకు కృషి చేద్దాం.
వృక్షో రక్షిత రక్షతః -- చెట్లను కాపాడండి అవి మనలను కాపాడుతాయి
ఈ సదుద్దేశంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరన్నపాలెం గ్రామం లో ది . 4-03-2019 న చెట్లను పెంచే హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా గ్రామానికి త్రాగు నీటిని అందించే చెరువు చుట్టూ మొక్కలు నాటి వాటిని పశువుల నుండి కాపాడటానికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యలు ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ , శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు శ్రీమతి కొడాలి రాఘిణి, శ్రీమతి కొల్లా రత్న కుమారి మొదలగు వారులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారం తో గ్రామంలో మిగిలిన ఖాళీ ప్రదేశాలలో కూడా ప్రతి నెల మొక్కలు నాటాలని భావిస్తున్నది.
Comments
Post a Comment