కర్మ యోగి మల్లిఖార్జున రావు-5

స్ఫూర్తి ప్రధాత -5

విశ్వాసం వివిధరకాలుగా దర్శనమిస్తుంది. దైవిక భావ నమ్మికలలో అద్భుతాలు, అతీత శక్తుల పాత్ర కూడా ఒకటి. సహజంగా ఒక వ్యక్తి తనను తాను దైవంశ భూతునిగా పరిగణించుకునే క్రమంలో ఇవి ప్రధాన భూమికగా ఉంటాయి. వీటిలో చాలావరకు అవాస్తవాలు గాను మిగిలినవి అతిశయోక్తులుగాను ఉంటాయి. అయితే వాటిని వాస్తవాలుగా, దైవలీలలుగా ప్రచారం చేసే ఒక ప్రాయోజిత వర్గం ఉంటుంది. ఏపుట్టలో ఏముందో అనే వాదనతో నమ్మితే నష్టం లేదన్నట్లుగా జరిగే ప్రచారంలో అనేకమంది అమాయకులు ఆకర్షించబడుతారు. దైవబలం తో పాటు గ్రహబలం, గృహబలం అంటూ రకరకాల నమ్మికలు కూడా చోటు చేసుకుంటాయి. అదృష్టానికి వీటి అందండలు ఉంటాయని అందరిలా మల్లిఖార్జునరావు కూడా భావించేవారు. 

స్వతాహా హేతుబద్ధ ఆలోచన, ఆచరణ ఉన్న మల్లిఖార్జున రావు లో కూడా కొంతకాలం ఈ  ఆకర్షణలకు భ్రమలకు లోనై వాటిని నమ్మి ఆచరించాడు. జ్యోతిష్యాలు, హస్త రేఖలు, మహిమలు నిజమని తలచేవారు. తరుచూ లాటరీ టిక్కెట్లు కొని లక్కు లేదని నిరుత్సాహ పడేవారు. 
1996 లో వాస్తులో ఏముంది? అనే పుస్తకంలో ఉన్న చిత్రం 
కొన్ని సంఘటనలు భవిషత్తులో సమాజ శ్రేయస్సుకు దారిచూపేగా ఉంటాయి అన్న దానికి ఒక మంచి ఉదాహారణ వాస్తుపై మల్లిఖార్జున రావు చేసిన ప్రయోగం దాని పర్యవసానాలు. జిజ్ఞాస సత్యాసత్య అన్వేషణకు దోహద పడుతుంది అనేది నిరూపితం అయింది.  
కుంకలమర్రు గ్రామానికి చెందిన తన మిత్రుడు సంజీవరావు  అనే సిద్ధాంతి ప్రోద్బలంతో గృహ వాస్తును అధ్యయనం చేసారు, ముఖ్య విషయాలను నోట్స్ రూపంలో ఒక పుస్తకంలో రాసుకున్నారు. దాని ప్రభావంతో ఇంటికి కొన్ని వాస్తు మరమ్మతులు చేసారు. ఊరి జనానికి ఉచిత వాస్తు సలహాలు చెప్పేవారు. 
అప్పుడే సమాజంలో వాస్తు పేరుతో సరికొత్త సూత్రాలు వ్యాప్తి చెందుతున్నాయి. మానవుల అభివృద్ధికి, అష్టకష్టాలకు కేవలం ఇంటి వాస్తే కారణం అని, దిశ కుదిరితే దశ బాగుంటుందనే  ఈ నయా వాస్తుకి రూపకర్త ముద్రగడ రామారావు గారు. వీరిని 1970లో విజయవాడ నుండి వీరన్నపాలెం తీసుకువచ్చి ఇంటిని చూపించటం, ఆయన చెప్పినట్లు తన ఇంటికి ఈశాన్య మూల ఉన్న మెట్లు కూలగొట్టడం ఏకకాలంలో జరిగాయి.
ఇంటికి వాస్తు మరమత్తులు చేసిన తరువాత సిద్ధాంతులు చెప్పిన గొప్ప మార్పులైతే గోచరించలేదుకాని దాని ప్రభావం మాత్రం వారి చిన్న కుమారుడు శ్రీనివాస్ పై కనపడి తదుపరి కాలంలో వాస్తుపై సమగ్ర పరిశోధనకు దోహదపడింది. మల్లిఖార్జున గారి నుండి  నేర్చుకున్న వాస్తు విషయాలు వల్ల శ్రీనివాస్ కు వాస్తుపై ఆసక్తి కలిగింది. క్రమేణా ఆసక్తి అన్వేషణగా మారి 1996లో 'వాస్తులో ఏముంది?' అనే పరిశోధనా పుస్తకాన్ని రాయటానికి ప్రేరణ కల్గించింది. ఈ మహత్కాకార్యానికి ప్రత్యక్షముగా దోహదపడిన మహానుభావుడు , గురుదేవుడు మల్లిఖార్జునరావే అనుటకు సందేహం లేదు. 



'వాస్తులో ఏముంది?' అనే గ్రంధంలో శ్రీనివాస్ ఈ విషయాలను అంతరంగం అనే పేరుతో కూలంకుషంగా చర్చించటం చూడవచ్చు. వాస్తులో ఏముంది? అనే ఈ గ్రంధాన్ని శ్రీనివాస్ గారు  తన జననీ జనకులైన  లక్ష్మి దేవమ్మ,మల్లిఖార్జునరావులకు అంకితం చేసారు. ఆతరువాత శ్రీనివాస్ గారు వాస్తులో వాస్తవాలు, వాస్తు విద్య అనే పుస్తకాలతో పాటు వాస్తుపై అనేక పరిశోధనా వ్యాసాలు  రాసారు. కార్యాకారణ  వాదంతో హేతుబద్దంగా, సివిల్ ఇంజనీరింగ్ కోణంలో వాస్తును ఒక ప్రాచీన భవన నిర్మాణ శాస్త్రంగా నిరూపించారు. వాస్తు పేరుతో అల్లుకున్న అపోహలు, ఆశానిరాశలు, భయాందోళనలకు చరమగీతం రాసారు.  
వాస్తును సమగ్రహంగా అర్ధం చేసుకోవాలన్న శ్రీనివాస్ వాదనను  మల్లిఖార్జున రావు పూర్తిగా అంగీకరించి దాన్ని బలపరిచారు. ఇల్లు కట్టుకోవటానికే వాస్తు అని, కూలగొట్టుకోవటానికి కాదని సలహా చెప్పేవారు. వాస్తు జ్యోతిష్యం వంటి నమ్మకాలను పూర్తిగా వదిలేశారు. 

(సశేషం) 

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం