దాన గుణం
దాతవ్యం భోక్తవ్యం సతివిభవే సంగ్రహే న కర్తవ్య:!
పశ్యేహం మధుకరీణ సంచితమర్ధం హరిష్యన్తే !!
One should spend his/her wealth either by giving it as charity, or at least for his own consumption. A person's duty is not to earn wealth just for the sake of accumulation. The same lesson can be learnt from the fate of honey bees, whose collection of honey is plundered by others.
ధనము కూడబెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వధాభిరామ వినురవేమ.
తాత్పర్యం : బాగా ధనము కలిగిన పిసినారి ఆ ధనమును ఇతరులకు ధాన ధర్మములు చేయక, తాను కూడా తినక, అనుభవించక వాటిని చూసుకుంటూ జీవతం గడిపేసి చివరికి చనిపోతాడు. తేనెటీగ కూడ ఎంతో కష్టపడి పూలలోని మకరంధాన్ని తెచ్చి తేనెను తయారు చేసి అవి తాగకుండా పరుల పాలు చేస్తాయి.
ప్రతి వ్యక్తి తాను సంపాదించిన సంపదను దానం చేయటంలోనో లేక తన అవసరాలకు వినియోగించటంలోనో ఖర్చు పెట్టాలి. అంతేకాని సంపదను కూడబెట్టానికి మాత్రమే అనుకోవటం సరైన ఆలోచన కాదు. తేనెటీగలు అహర్నిశం కష్టపడి కూడబెట్టిన తేన తమకు కాకుండా పరులు అనుభవిస్తున్నట్లే తాము సంపాదించిన సంపదలు కూడా వారి తదనంతరం పరుల పాలు అవటం తధ్యం. నిజానికి ఒకరి వద్ద సంపద ప్రోగుపడిందంటే అది సమాజం నుండి గ్రహించిందన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. తేనెటీగలు పూలనుండి తేనె ను కూడబెడతాయి అనేది ఎంత నిజమో తమ వద్ద కూడబెట్టున సంపద కూడా సమాజాం నుండి సేకరించబడినదేనన్నవిషయం కూడా అంతే వాస్తవం. తనకు సమాజం నుండి లభించిన సంపదలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వటం మానవ ధర్మం.
Comments
Post a Comment