ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి
పరిపూర్ణ జీవితం అంటే అర్ధం తెలిపిన ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి. 92 సంవత్సరాల అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన వీరి జీవన శైలి మనకందరికీ సదా ఆచరణీయం. నాలుగు తరాలను చూసిన వ్యక్తి. సమాజం గురించి చింతన, ఆరోగ్యం గురించిన ఆలోచన, దైవ భక్తి, యోగ సాధన వెరిసి మెరిసే ఆత్మీయ వ్యక్తి, ఆదర్శ శీలి బుచ్చియ్య చౌదరి గారు. గోరంట్ల వీరరాఘవయ్య పిచ్చమ్మ దంపతులకు 1926లో వీరన్నపాలెం గ్రామంలో నాలుగోవ సంతానంగా బుచ్చియ్య చౌదరి జన్మించినారు. తన మేనత్త గడగొట్టు రాఘవమ్మ, సుబ్బయ్య గార్ల మూడవ కుమార్తె అలివేలు మంగమ్మను వివాహమాడారు, వారికి తులశమ్మ, రాఘవేంద్రరావు ,సాంబశివరావు అనే ముగ్గురు బిడ్డలు. పీయూసీ వరకు చదువుకున్న బుచ్చియ్య చౌదరి గారికి వ్యాపారం అంటే మక్కువ. వ్యవసాయం తో పాటు అనేక వ్యాపారాలు చేసి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ వ్యక్తి. అనేక మందికి న్యాయ సలహాలు అందించి సహాయ పడ్డ వ్యక్తి. నవ్యభారతి విద్యా సంస్థల వ్యవస్థాపక సభ్యులు తన రెండవ అన్న కీర్తి శేషులు గోరంట్ల రామయ్య చౌదరి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కార్య నిర్వాహ ...