కొమల సేవాసదన్
కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సేవాకార్యక్రమాలకు శాశ్విత కేంద్ర బిందువు గా వీరన్నపాలెం లో నిర్మించే ' కొమల సేవాసదన్' ఉంటుంది. ట్రస్ట్ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవాసదన్ నిరంతరం పనిచేస్తుంది. ట్రస్టు చేపట్టే బహుముఖ సేవాకార్యక్రమాలకు ఇది వేదికగా ఉంటుంది. సేవాసదన్ నిర్మాణంలో కొమల ట్రస్ట్ వారి ముఖ్య ఉద్దేశాలు : 1. గ్రామ ప్రజల శుభాశుభ అవసరాలకు కావలిసిన సామాజక భవనం /కళ్యాణ మండపాన్ని ముఖ్య భాగంగా, ఇతర సేవా కార్యక్రమాలకు అనువు గా ఈ శాశ్విత భవనం నిర్మించటం 2. వివేకవంతమైన విద్య, వ్యక్తిత్త్వవికాసానికి, జీవనోపాధికి ఉపయోగపడే సాంకేతిక, నైపుణ్య విద్యా, వ్యవసాయ శిక్షణా తరగతులను నిర్వహించటం 3. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటులో అవసరమైన వైద్యశిభిరాలు ఏర్పాటు, ప్రాధమిక వైద్యశాల కు వసతి/నిర్వహించుట. 4. సాహిత్య, వినోద కళా సంస్కృతులను ప్రోత్సహించే కార్యక్రమాలను, యువతలో చైతన్యం కలిగించే ఆలోచనాత్మక /మానవీయ/ నైతిక విలువలను ప్రోత్సహించేలా వ్యక్తిత్త్వ వికాస ప్రసంగాలు/ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. 5. గ్రామం వదిలి వెళ్లిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనాలకు,వేడుకలకు/...