రిపబ్లిక్ దినోత్సవం - విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు
ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (1926-2017) జ్ఞాపకార్థం వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది. కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవం నాటి కార్యక్రమం వాయదా పడినందువల్ల దానిని రిపబ్లిక్ దినోత్సవం 26 జనవరి,2021న, జరిపారు. ముందుగా జండా వందనం చేసి ఆతరువాత సభను జరిపి, చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యర్దులు అందరికి జామంట్రీ బాక్స్ తో పాటు వివిధ రకాల పుస్తకాలను బహుమతులుగా అందించబడ్డాయి. వీటితోపాటు ప్రతి తరగతిలో ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు శ్రీ పునుగుపాటి వెంకటేశ్వర రావు గారి కుమార్...