కర్మ యోగి మల్లిఖార్జున రావు-4
శ్రీ చిన్నమ్మ స్ఫూర్తి ప్రధాత - 4 ఆధ్యాత్మక చింతన ఆధ్యాత్మక భావనలు మెండుగా గల మల్లిఖార్జునరావుకు కాకతాళీయంగా రేపల్లె అవధూత శ్రీ చిన్నమ్మను దర్శించాక వారి చింతనలో కొంత స్పష్టత చేకూరింది. "చెట్టు బొమ్మ నుండి విత్తనాలు, ఆవు బొమ్మనుండి పాలు, దేవుని బొమ్మల నుండి మోక్షాన్ని సాదించలేరు. ఆవు బొమ్మ మనం వేసిన ఆహారాన్ని తినజాలదు. పోసిన నీరు త్రాగలేదు. మనకు పాలు ఇవ్వజాలదు. అట్లే విగ్రహాల ముందు మనం పెట్టే ఫలహారాలను అవి తినలేవు. తిరిగి వాటినుండి మనం ఆత్మశక్తిని పొందలేము" స్థూలంగా ఇది అవధూత శ్రీ చిన్నమ్మ(1887-1957) గారి తత్వ బోధనా సారం. వెలిగే దీపమే మరొక దివ్వెను వెలిగిస్తుంది. కాగితం పై చిత్రించిన దీపపు బొమ్మ మరొక దీపాన్ని వెలిగించటానికి ఎలా పనికిరాదో అలాగే గుడిలో విగ్రహరూపంలోఉన్న దేవుని బొమ్మ ఆత్మజ్యోతిని వెలిగించ లేదు. పరంజ్యోతిని గురించి తెలుసుకోవాలంటే దాన్ని దర్శించిన లేదా తెలిసినవ్యక్తికే సాధ్యపడుతుంది. అలాంటి బ్రహ్మజ్ఞానం ఉన్న పరమగురువును అన్వేషించాలి. వారినుండి జ్ఞానబోధ పొందాలనే ప్రఘాఢమైన కోరిక మల్లిఖార్జున రావులో బలంగా నాటుకుపోయింది. అలుపెరుగని అన్వ...