S. V. M. M. ఓపెన్ షెల్టర్ లో సేవా కార్యక్రమం
కొమల చారిటబుల్ ట్రస్ట్ మరియు కళ్ళం హరనాథ రెడ్డ్ సాంకేతిక కళాశాల ( KHIT ) సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం సంయుక్తంగా 2-07-2017 ఆదివారం సాయంత్రం S. V. M. M. ఓపెన్ షెల్టర్ ,పట్టాభిపురం గుంటూరు లో ఉన్న అనాధ బాల బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న పిల్లల సంరక్షణ , యోగక్షమాచారాలు, విద్యావిషయాలు విచారించి వారి ఆటపాటలు చూసారు. ఆ తరువాత వారికి "దుప్పట్లు" వితరణ చేశారు. పిల్లందరికి భోజనం ఏర్పాటు చేసి వారితో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కొమల ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్, కార్యదర్శి శ్రీమతి కొడాలి రాఘిణి, ట్రస్టీ శ్రీమతి సుధీర లోకేష్ లతో పాటు KHIT సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం నుండి డాక్టర్ C.రమేష్ కుమార్ రెడ్డి, N.V. మోహన్ కృష్ణ , V. రాజేంద్ర కుమార్, K.శివ కిరణ్, M.ఈశ్వర్ రెడ్డి, P.మహేష్ రెడ్డి, తేజ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. N.V. మోహన్ కృష్ణ, V. రాజేంద్ర లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు....