కొమల చారిటబుల్ ట్రస్ట్ మరియు కళ్ళం హరనాథ రెడ్డ్ సాంకేతిక కళాశాల ( KHIT ) సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం సంయుక్తంగా 2-07-2017 ఆదివారం సాయంత్రం S. V. M. M. ఓపెన్ షెల్టర్ ,పట్టాభిపురం గుంటూరు లో ఉన్న అనాధ బాల బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న పిల్లల సంరక్షణ , యోగక్షమాచారాలు, విద్యావిషయాలు విచారించి వారి ఆటపాటలు చూసారు. ఆ తరువాత వారికి "దుప్పట్లు" వితరణ చేశారు. పిల్లందరికి భోజనం ఏర్పాటు చేసి వారితో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కొమల ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్, కార్యదర్శి శ్రీమతి కొడాలి రాఘిణి, ట్రస్టీ శ్రీమతి సుధీర లోకేష్ లతో పాటు KHIT సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం నుండి డాక్టర్ C.రమేష్ కుమార్ రెడ్డి, N.V. మోహన్ కృష్ణ , V. రాజేంద్ర కుమార్, K.శివ కిరణ్, M.ఈశ్వర్ రెడ్డి, P.మహేష్ రెడ్డి, తేజ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. N.V. మోహన్ కృష్ణ, V. రాజేంద్ర లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
సమాజంలో నానాటికి మానవత్వం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ దాదాపు 80 మంది అనాధ పిల్లలను చేరదీసి వారికి మంచి వసతి కల్పించి విద్యా బుద్దులు నేర్పుతున్న S. V. M. M. ఓపెన్ షెల్టర్ నిర్వాహకులను ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ గారు అభినందించారు. ఈ అనాధ బాలబాలికలకు భవిషత్తులో తాము అండగా ఉంటామని, ప్రతి మాసం లోను సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.
|
S. V. M. M. ఓపెన్ షెల్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ |
|
S. V. M. M. ఓపెన్ షల్టర్ లో బాలికలకు దుప్పట్లు వితరణ చేస్తున్న శ్రీమతి కొడాలి రాఘిణి |
|
దుప్పట్లు వితరణ చేస్తున్నకొమల ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ |
కొమల ట్రస్టీ శ్రీమతి సుధీర లోకేష్ చేతులమీదుగా దుప్పటి అందుకుంటున్న చిన్నారి
|
ఆట పాటలతో ఆనందంగా ఉన్న ఆశ్రమ విద్యార్థులు |
|
పిల్లలకు భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు |
Comments
Post a Comment