Posts

Showing posts from July, 2018

కొమల ట్రస్ట్ కు ఆదాయపన్ను మినహాయింపు

Image
కొమల చారిటబుల్ ట్రస్ట్ కు వచ్చే విరాళాల కు సంబంధించిన ఆదాయానికి కేంద్ర ఆదాయ పన్నుల శాఖ నుండి  పన్ను మినహాయింపు లభించింది. 2018-19 ఆదాయ మదింపు సంవత్సరం నుండి కొమల ట్రస్టుకు వచ్చే అన్ని విరాళాలు  U/s  12 AA  of Income Tax Act ,1961 లోబడి పన్ను మినహాయిపు లభించిందని ఆనందముగా  తెలియజేస్తున్నాము.  ఈ 12AA (Order No: ITBA/EXM /S/12AA/ 2018-19/1010482890(1))  అనుమతి లభించి నందువల్ల  ట్రస్టు వారు చేసే సేవా కార్యక్రమాలకు లభించే ఆదాయాన్ని మొత్తము వాటి కొరకే  వినియోగించే వెసులుబాటు లభించింది. కొమల ట్రస్ట్ కు 12 AA సాధించటానికి మన ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలు పరివేక్షించే ప్రముఖ ఆడిటర్, సేవా జీవి    శ్రీ యర్రా ఈశ్వరరావు గారి కృషి మరువలేనిది. వారికి కొమల చారిటబుల్ ట్రస్ట్ తరుపున మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.