SNB విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhw4wPZxC31fuZznm2lo5JqKjElyYvBJvl4mVdHODPBzFPad1EkycEvJAYYUBKlYnWCdEzdAUBmC3nTG5LJZh_ngJgMfUMd8wdOs2gHU9VKCg4tvks5avLYTN8crCY2vqKmG_dvU0VX8-Q/s640/39208341_249279949051094_3447451342329610240_n.jpg)
మన దేశ 72వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 15 ఆగష్టు 2018 న వీరన్నపాలెం లో కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్ఞాపకార్థం వారి అర్డంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిధి గా పాల్గొన్న కొమల ట్రస్ట్ చైర్మన్ , పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ కొడాలి శ్రీనివాస్ గారిచే జండా ఆవిష్కరణ, వందన సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నవ్య భారత విద్యాలయాల పాలక వర్గ అధ్యక్షులు శ్రీ చిట్టినేని సురేష్ బాబు, కార్యదర్శి శ్రీ యార్లగడ్డ సీతారామయ్య , సభ్యులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు, శ్రీ గోరంట్ల శేషగిరిరావు , అతిధులుగా శ్రీ మానికొండ శ్రీనివాసరావు, శ్రీ మక్కెన సింగయ్య పాల్గొన్నారు. 10 వ తరగతి పబ్లిక్ పరిక్షలలో ప్రధమ, ద్వితీయ , తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మానికొండ శ్రీనివాసరావు వారి తండ్రి జ్ఞాపకార్థం నగదు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ నవ్య భారత...