SNB విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు


మన దేశ 72వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 15 ఆగష్టు 2018 న  వీరన్నపాలెం లో కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్ఞాపకార్థం వారి అర్డంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిధి గా పాల్గొన్న కొమల ట్రస్ట్ చైర్మన్ , పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ కొడాలి శ్రీనివాస్ గారిచే జండా ఆవిష్కరణ, వందన సమర్పణ జరిగింది. 


ఈ కార్యక్రమంలో శ్రీ నవ్య భారత విద్యాలయాల పాలక వర్గ అధ్యక్షులు శ్రీ చిట్టినేని సురేష్ బాబు, కార్యదర్శి శ్రీ యార్లగడ్డ సీతారామయ్య , సభ్యులు శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు, శ్రీ గోరంట్ల శేషగిరిరావు , అతిధులుగా శ్రీ మానికొండ శ్రీనివాసరావు, శ్రీ మక్కెన సింగయ్య పాల్గొన్నారు. 10 వ తరగతి పబ్లిక్ పరిక్షలలో ప్రధమ, ద్వితీయ , తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మానికొండ శ్రీనివాసరావు వారి తండ్రి జ్ఞాపకార్థం నగదు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ నవ్య భారత ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్నెగంటి కుమారస్వామి గారు , శ్రీ నవ్య  భారత గోరంట్ల బుచ్చిపాపయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు గారు నిర్వహించారు. 



కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

పరిపూర్ణ జీవితం అంటే అర్ధం తెలిపిన ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి. 92 సంవత్సరాల అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన వీరి జీవన శైలి మనకందరికీ సదా ఆచరణీయం. నాలుగు తరాలను చూసిన వ్యక్తి. సమాజం గురించి చింతన, ఆరోగ్యం గురించిన ఆలోచన, దైవ భక్తి, యోగ సాధన వెరిసి మెరిసే ఆత్మీయ వ్యక్తి బుచ్చియ్య చౌదరి గారు. వ్యవసాయం తో పాటు అనేక వ్యాపారాలు చేసి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ వ్యక్తి. వీరన్నపాలెం శ్రీ నవ్యభారత హై స్కూల్ నిర్మాణం,నిర్వహణలో తుది వరకు నిబద్దతతో పనిచేసిన మార్గ నిర్దేశకుడు చౌదరి గారు.  వారు ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ఇచ్చేవారు. వారి తదనంతరం కూడా ఇదే ఆనవాయితీని కొనసాగించాలని కొమల ట్రస్ట్ వారు భావిస్తున్నారు. గుప్తదానాలు, ఆత్మీయ పలకరింపులు, నిండైన రూపం పాత తరం తీపి జ్ఞాపకం నాకు మేనమామ బుచ్చియ్య చౌదరి గారు. మన కొమల చారిటబుల్ ట్రస్ట్ ను మనసారా దీవించి దాని పురోగతిని ఆకాంక్షించిన వ్యక్తి. వారి ఆకస్మిక నిష్కక్రమణ మాకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2