వీరన్న పాలెం గ్రామం లో కల్యాణ మండపం / సేవా సదనం
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం , వీరన్న పాలెం గ్రామం లో కొమల ట్రస్ట్ వారు తమ సేవా కార్యక్రమాలలో భాగంగా " సేవా సదనం " (కమ్యూనిటీ హాల్ / కల్యాణ మండపం ) నిర్మించుటకు పర్చూరు-బాపట్ల రోడ్ (చెరువు ఒడ్డున) సెప్టెంబర్ 28, 2018 న షుమారు 25 సెంట్లు స్థలాన్ని శ్రీమతి సోమేపల్లి సీతారావమ్మ, వారి కుమారుడు శ్రీనివాసరావు గార్ల నుండి సేకరించిందని సంతోషంగా తెలియజేస్తున్నాం. త్వరలో ఒక శుభసమయాన భూమి పూజ చేసుకొని వీరన్న పాలెం గ్రామ వాసుల చిరకాలస్వప్నమైన,సామాజిక భవనం ( కల్యాణ మండపం) ఒక రూపుదిద్దుకుంటుంది. ఈ బృహత్తర కార్యంలో మీ సలహాలు సూచనలు ట్రస్ట్ వారికి అందజేయగలరు. సేవా సదనం ఒక రూపు దాల్చే కార్యక్రమంలో ప్రత్యేక్షముగా కానీ , పరోక్షంగా కానీ సహకారం అందించే వారు దీన్ని మిత్రులందరికీ షేర్ చేయండి. చినుకు చినుకు కలిస్తే నది అవుతుంది. చేయి చేయి కలిపి కలసి కదిలితే సమాజం బాగుంటుంది. రండి మన జన్మ భూమి వీరన్నపాలెం రుణం తీర్చుకుందాం.