Posts

Showing posts from November, 2018

డాక్టర్ సాంబమూర్తి గారికి ఘన నివాళి

Image
వీరన్న పాలెం గ్రామం లో 8-11-2018 న  డాక్టర్ సాంబమూర్తి గారి దశదిన కర్మ సందర్భంగా వారి సంతాప సభ జరిగినది. ఈ సంతాప సభకు  కొమల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్  శ్రీ కొడాలి శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించి డాక్టర్ గారి వ్యక్తిత్వం, సేవా నిరతి ,నిస్వార్ధత ను గురించి సవివరంగా తెలియ జేశారు. ముందుగా శ్రీ కన్నెగంటి కుమారస్వామి గారు స్వాగతోపన్యాసం చేయగా ప్రముఖ వ్యాపారవేత్త , నందమూరి బసవతారం ట్రస్ట్ కోశాధికారి శ్రీ జెట్టి శివరామ్ ప్రసాద్ గారు ముఖ్య వక్త గా ప్రసంగిస్తూ డాక్టర్ గారి నిరాడంబరతను గూర్చి కొనియాడారు. సభలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు శ్రీ గడగొట్టు రాంబాబు గారు , కుమార స్వామి గారు, సింగారెడ్డి గారు పాల్గొని సాంబమూర్తి గారితో వారికున్న అనుభవాలు పంచుకున్నారు. సంఘసేవకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ కొల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ గారి స్ఫూర్తి పదికాలాలు గుర్తు ఉండేలా ఏదైనా ఒక శాశ్విత కార్యక్రమం చేపట్టితే బాగుంటుందని కుటుంబ సభ్యులకు, మిత్రులకు సూచించారు. దీనికి స్పందనగా త్వరలో వీరన్నపాలెం గ్రామంలో కొమల  ట్రస్ట్ వారు నిర్మించే సేవా సదనంలో ఆత్మీయుల సహకారంతో ...