డాక్టర్ సాంబమూర్తి గారికి ఘన నివాళి

వీరన్న పాలెం గ్రామం లో 8-11-2018 న డాక్టర్ సాంబమూర్తి గారి దశదిన కర్మ సందర్భంగా వారి సంతాప సభ జరిగినది. ఈ సంతాప సభకు కొమల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొడాలి శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించి డాక్టర్ గారి వ్యక్తిత్వం, సేవా నిరతి ,నిస్వార్ధత ను గురించి సవివరంగా తెలియ జేశారు. ముందుగా శ్రీ కన్నెగంటి కుమారస్వామి గారు స్వాగతోపన్యాసం చేయగా ప్రముఖ వ్యాపారవేత్త , నందమూరి బసవతారం ట్రస్ట్ కోశాధికారి శ్రీ జెట్టి శివరామ్ ప్రసాద్ గారు ముఖ్య వక్త గా ప్రసంగిస్తూ డాక్టర్ గారి నిరాడంబరతను గూర్చి కొనియాడారు. సభలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు శ్రీ గడగొట్టు రాంబాబు గారు , కుమార స్వామి గారు, సింగారెడ్డి గారు పాల్గొని సాంబమూర్తి గారితో వారికున్న అనుభవాలు పంచుకున్నారు. సంఘసేవకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ కొల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్టర్ గారి స్ఫూర్తి పదికాలాలు గుర్తు ఉండేలా ఏదైనా ఒక శాశ్విత కార్యక్రమం చేపట్టితే బాగుంటుందని కుటుంబ సభ్యులకు, మిత్రులకు సూచించారు. దీనికి స్పందనగా త్వరలో వీరన్నపాలెం గ్రామంలో కొమల  ట్రస్ట్ వారు నిర్మించే సేవా సదనంలో ఆత్మీయుల సహకారంతో డాక్టర్ గారి పేరుతో ఆరోగ్య కేంద్రం నిర్వహించాలనే ప్రణాళిక ఉందని ట్రస్ట్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఈ సంతాప సభలో కొమల ట్రస్ట్ సభ్యలు  శ్రీ గోరంట్ల రాఘవేంద్ర రావు, శ్రీమతి కొడాలి రాగిణి గారు, డాక్టర్ మున్నంగి శివయ్య గారు కొల్లా సుబ్బారావు , కొల్లా సతీష్ బాబు మరియు  డాక్టర్ సాంబమూర్తి గారి బంధు మిత్రులు అనేకమంది పాల్గొని వారికి ఘన నివాళి సమర్పించారు. ఆ తరువాత అన్నదాన కార్యక్రమం జరిగింది. 






డాక్టర్ సాంబమూర్తి 

వైద్యో నారాయణో హరి అనే నానుడికి అక్షర రూపం డాక్టర్ సాంబమూర్తి. వైద్యం వ్యాపార వస్తువుగా మారి సామాన్యులకు అందుబాటు లో లేని ఈ కాలంలో ప్రభుత్వ వైద్యునిగా తనుఉన్నాను అనే ప్రజా వైద్యుడు దొప్పలపూడి సాంబమూర్తి గారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ డబ్బుకు ఆశపడని. ప్రవేటు వైద్యం చేయని నిజాయితి గల వ్యక్తి. ఎటువంటి  బేషజాలు, డాంబికాలు  లేని సాదాసీదా వేష ధారణలో నడయాడే అసమాన్య ప్రజ్ఞా శాలి మన డాక్టర్ గారు. అనారోగ్య బాధితులకు ఒక భరోసా ఇచ్చే ఆత్మీయ అపర ధన్వంతరి.
పోతుకట్ల లో సామాన్య రైతు కుటంబంలో జన్మించి వైద్యవిద్యలో 
M. S. చదివి ప్రభుత్వ వైద్య శాలల్లో సర్జన్ గా సేవలందించారు. 
1983 లో బాపట్ల లో నేనుపనిచేసే రోజులనుండి( వారు అప్పుడు బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసేవారు) నేటి వరకు వారితో నాకు మాకుటుంబానికి ముఖ్యంగా మానాన్నకొడాలి మల్లిఖార్జునరావు గారితో ఉన్న స్నేహబంధం మరువలేనిది. తత్వ,మత, వేదాంత విషయాలలో ఇద్దరు సంభాషించుకునేవారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి.  మంచి చదువరి. బంధు మిత్రులకు సహాయపడే స్నేహశీలి. తన తమ్ముని కుమార్తె విజయ లక్ష్మిని నా పర్యవేక్షణలో సత్తుపల్లి ( ఖమ్మం జిల్లా) లో ఇంజినీరింగ్ చదివించి నప్పుడు వారి కుటుంబ ప్రేమను ప్రత్యక్షంగా గమనించాను. వీరి సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్టు వీరన్నపాలెం గ్రామంలో ఒక ప్రాధమి వైద్య శాల నిర్వహించాలని ప్రణాళిక రూపొందించుకుంది. డాక్టర్ గారి మరణం వారి కుటుంబానికేకాక యావత్తు వీరన్నపాలెం గ్రామానికి   ముఖ్యంగా మా కొమల చారిటబుల్ ట్రస్ట్ వారికి తీరనిలోటు.
మనుషులు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరే సమాజానికి గుర్తుంటారు. ఆకోవకు చెందిన ధన్యజీవి డాక్టర్ దొప్పలపూడి సాంబమూర్తి గారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ... 
బాధాతప్త హృదయంతో  కొడాలి శ్రీనివాస్/ కొమల ట్రస్ట్ 

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి