ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్ఞాపకార్థం (1926-2017) వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది. దీనిలో భాగంగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఆగష్టు 15, 2019 న చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందించబడ్డాయి. వీటితోపాటు 10 వ తరగతి పబ్లిక్ పరిక్షలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మానికొండ శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ముత్తాత,తాతమ్మ పాపయ్య,వీరమ్మ తాత నాయనమ్మ పోతురాజు, సీతమ్మ తండ్రి వెంకటేశ్వర్లు, చెల్లి జ్యోతి ల జ్ఞాపకార్థం నగదు బహుమతులు ఇచ్చారు. తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు శ్రీ దగ్గుపాటి శ్రీనివాసరావు సౌజన్యం తో నగదు బ...