నిత్యకృషీ వలుడు డాక్టర్ సి. వి. జి. చౌదరి
వ్యసాయం తప్పా మరో వ్యాపకం లేని కాలంలో కనుచూపు దూరంలో చదువులు చెప్పే బడులు లేని కుగ్రామంలో స్వయం కృషితో విదేశాలకు వెళ్లి అత్యున్నత విద్యను ఆర్జించిన పశు వైద్య మేధావి, పశు విద్యా కృషీ వలుడు, వీర జవాన్ లండన్ వెంకటేశ్వర్లుగా ఖ్యాతి గడించిన డాక్టర్ సి. వి. జి. చౌదరి,MRCVS నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత. కృషి ఉంటె మనుషులు మహా పురుషులు అవుతారన్న దానికి నిదర్శనం చౌదరి జీవితం. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం (ఆనాటి పర్చూరు ఫిర్కా, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా) గ్రామంలో గోరంట్ల వీరరాఘవయ్య, పిచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా 1914లో గోరంట్ల చిన వెంకటేశ్వర్లు చౌదరి గారు జన్మించారు. వీరికి ముగ్గురు సోదరులు రామయ్య చౌదరి, వేంకట సుబ్బయ్య చౌదరి, బుచ్చియ్య చౌదరి మరియు ఒక సోదరి కొడాలి లక్ష్మి దేవమ్మ. MAJOR DR.C.V.G. CHOWDARY - 1914-1989 గ్రామ మన్సుబుగా పనిచేస్తున్న 150 ఎకరాల భూస్వామి అయిన వీరరాఘవయ్య గారు స్వాతంత్ర పోరాట యోధుడు. దేశ భక్తి, లోకజ్ఞానం ఉన్న ముందుచూపు గల వ్యక్తి. అందరికి మంచి చెడులు చెప్పే గ్రామపెద్ద. చదువు చేదుగా ఉంటుంది కానీ అది అందించే ఫలాలు ఎప్పుడ...