సమాజక సేవ లో 'కొమల చారిటబుల్ ట్రస్ట్ '
కీర్తిశేషులు శ్రీ కొడాలి మల్లిఖార్జునరావు, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గార్ల స్పూర్తితో వారి కుమారుడు కొడాలి శ్రీనివాస్ తన జీవిత భాగస్వామి శ్రీమతి రాఘిణి తో కలసి కొమల చారిటబుల్ ట్రస్ట్ (Reg.No:50/2016) అనే దాతృత్వ సేవా సంస్థను గుంటూరు కేంద్రంగా శ్రీమతి లక్ష్మీ దేవమ్మగారి ప్రధమ వర్దంతి (1-06-2016) న నెలకొల్పారు.
కొమల చారిటబుల్ ట్రస్ట్ స్పూర్తి ప్రదాతలు
శ్రీ కొడాలి మల్లిఖార్జున రావు - శ్రీమతి లక్ష్మీ దేవమ్మ
ట్రస్ట్ ఆశయాలు :
1. వివేకవంతమైన విద్య, వ్యక్తిత్త్వవికాసానికి, జీవనోపాధికి ఉపయోగపడే సాంకేతిక, నైపుణ్య విద్యా, శిక్షణాసంస్థలు ఏర్పాటు, అర్హులైన పేద విద్యార్దులకు ఆర్ధిక సహకారం. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మధ్యాహాన్న భోజన కార్యక్రమం లో సహ దాతగా సేవ చేయటం. ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించటం.
2. ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటులో సహాయ సహకారాలు అందించటం. అందరికి అందుబాటులో అవసరమైన వైద్యశిభిరాలు ఏర్పాటు, ప్రాధమిక వైద్య శాలలు నిర్వహణ.
3. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్ర భారతావనికి కృషి చేయటం. నింగి, నేల, నీరు, చెట్ల సంరక్షణ, కాలుష్యాన్ని నివారించటం.
4. సామాజక అవసరాలను గుర్తించి తగిన సౌకర్యాలు ఏర్పరచటం, నిర్వహించటం. స్త్రీ, శిశు, అనాధ, వృద్దులకు శరణాలయాలు, ఆశ్రయాలు కల్పించటం. సహాయ సహకారాలు అందించటం.
5. సాహిత్య, కళా సంస్కృతుల పోషణ, క్రీడలు, తపాల బిళ్ళల సేకరణ వంటి అబిరుచులను, మానవీయవిలువలను ప్రోత్సహించటం. ఉత్తమ వ్యక్తులకు పురస్కారాలతో గౌరవించటం.
6. సామాజక విజ్ఞాన/సేవా భవనం /కళ్యాణ మండపాన్ని నిర్మించటం
కార్య క్షేత్రం
ఈ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలు మొదట ప్రకాశం జిల్లా పరుచూరు మండలం, వీరన్నపాలెం గ్రామం లోను, గుంటూరు నగరం నందు నిర్వహిస్తూ ఆ తరువాత ఇతర ప్రాంతాలకు శక్తిని బట్టి విస్తరించగలదు.
ట్రస్ట్ నిర్వాహకులు మరియు వ్యవస్థాపకులు:
శ్రీ కొడాలి శ్రీనివాస్ , శ్రీమతి రాఘిణి
విరాళాలు:
నిబద్దతతో నిస్వార్దంగా నిర్వహించే ఈ బృహత్తర సమాజసేవా కార్యక్రంలో మీ అందరి ఇతోధిక సహాయ సహకారాలు అందించ గలరని అర్దిస్తున్నాం.
సేవా నిధికి ఇచ్చే విరాళాలు"komala charitable trust" పేరుతో గుంటూరులో చెల్లుబాటు అయ్యేలా డి. డి. లేదా చెక్ ద్వారా కానీ, ఆన్ లైన్ లో కానీ ట్రస్ట్ ఖాతా లో జమ చేయవచ్చు.
కొమల చారిటబుల్ ట్రస్ట్ కు వచ్చే విరాళాల కు సంబంధించిన ఆదాయానికి కేంద్ర ఆదాయ పన్నుల శాఖ నుండి పన్ను మినహాయింపు లభించింది. 2018-19 ఆదాయ మదింపు సంవత్సరం నుండి కొమల ట్రస్టుకు వచ్చే అన్ని విరాళాలు U/s 12 AA of Income Tax Act ,1961లోబడి పన్ను మినహాయిపు లభించింది.
12AA(OrderNo: ITBA/EXM /S/ 12AA/ 2018-19/1010482890(1)) అనుమతి లభించి నందువల్ల ట్రస్టు వారు చేసే సేవా కార్యక్రమాలకు లభించే ఆదాయాన్ని మొత్తము ట్రస్ట్ లక్ష్యాల కొరకే వినియోగించే వెసులుబాటు లభించింది.
KCT సేవా నిధికి ఇచ్చే విరాళాలు "komala charitable trust" పేరుతో గుంటూరులో చెల్లుబాటు అయ్యేలా డి. డి. /చెక్ ద్వారా కానీ ,లేదా ఆన్ లైన్ లో కానీ దిగువున సూచించిన ట్రస్ట్ ఖాతా లో విరాళాలు జమ చేయవచ్చు.
KOMALA CHARITABLE TRUST
A/C NO. : 62472717654,
STATE BANK OF INDIA,
IFSC NO: SBIN 0020541
CHANDRAMOULI NAGAR, GUNTUR, A.P.
వివరాలకు :
http://komalacharitabletrust.blogspot.in
email:
1. profkodalisrinivas@gmail.com
2. komalacharitabletrust@gmail.com
Comments
Post a Comment