కొమల చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలలో భాగస్వామ్యం

'జన హితం - మన మతం' అనే ఆశయంతో సమాజసేవ,మానవ సేవ చేయటానికి నెలకొల్పిన కొమల చారిటబుల్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుదామనుకునే వదాన్యులకు, దాతలకు, పోషకులకు స్వాగతం. 


'ప్రార్ధించే పెదవుల కన్నా సాహాయం చేసే చేతులు మిన్న' అనే స్పూర్తితో ముందుకు వచ్చే దాతలకు కృతజ్ఞతాభినందనాలు. దాతలుగా మీరు ట్రస్ట్ కు ఇచ్చే విరాళాలు, వితరణలు మీరు కోరుకున్న సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించ బడతాయి. జన్మ దినం, పెళ్లి రోజు వంటి శుభ దినాలకు కానీ, ఆత్మీయులు, బంధువులు, హితుల జ్ఞాపకార్థం కానీ దాతలు విరాళాలు ఇవ్వవచ్చు. 

దాతల నుండి స్వీకరించే Rs.10,000/- అంతకు పైబడిన విరాళాలు ట్రస్ట్ శాశ్విత సేవా నిధికి జమ చేయబడతాయి. వాటిపై వచ్చే వడ్డీ రాబడిలో 80% మాత్రమే దాతల  అభీష్టం మేరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయబడతాయి. భవిషత్తులో ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకొని మిగిలిన 20% మొత్తం KCT మూలనిధికి జమ చేయటం జరుగుతుంది. 
Rs.10,000/-  కంటే తక్కువ మొత్తంలో అందజేసే విరాళాలు ఆ ఏడాదిలోనే దాత అభీష్టం మేరకు ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయబడతాయి.
దాతలకు సేవా కార్యక్రమాల వివరాలు ముందుగానే తెలియజేయబడతాయి. దాతల సలహాలు, సూచనలు స్వీకరించ బడతాయి. 

KCT సేవా నిధికి ఇచ్చే విరాళాలు

"komala charitable trust" పేరుతో గుంటూరులో చెల్లుబాటు అయ్యేలా 
డి. డి. /చెక్ ద్వారా కానీ ,లేదా ఆన్ లైన్ లో కానీ దిగువున సూచించిన ట్రస్ట్ ఖాతా లో విరాళాలు  జమ చేయవచ్చు.

KOMALA CHARITABLE TRUST
A/C NO.  : 62472717654
STATE BANK OF INDIA,
IFSC NO: SBIN 0020541
CHANDRAMOULI NAGAR, GUNTUR, A.P.
email: profkodalisrinivas@gmail.com

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి