ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్
వీరన్న పాలెం గ్రామం లో ది.10-2-2019 న "ప్లాస్టిక్ రహిత సమాజం - మై ప్లాస్టిక్ " అనే అంశం పై అవగాహన సదస్సు జరింగింది. ఈ అవగాహన సదస్సును చిలక లూరి పేట వాసవీ క్లబ్ వారు కొమల చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు,మై ప్లాస్టిక్ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కె . ప్రసాద్ గారు సమాజం పై చూపుతున్న ప్రభావాన్ని చక్కగా గ్రామస్తులకు వివరించారు. ఇంటిలో రోజువారీ వాడకంలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక సంచిలో వేసి వారానికి ఒక రోజు వాటిని గ్రామం లో నిర్దేశించిన ప్రదేశంలో వేసిన వాటిని అక్కడినుండి తాము తరలించి వాటిని రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కొమల ట్రస్ట్ చైర్మన్ కొడాలిశ్రీనివాస్ ప్రసంగిస్తూ ఇంటిలో వచ్చే వ్యర్థాలతో రెండు రకాలని , కుళ్లిపోయి భూమిలో కలిసే పోయే వ్యర్థాలను ఎరువులుగా వాడి భూమిని సారవంతం చేసుకోవచ్చని వాటికొరకు పంచాయితీ వారి సహకారం తో డంప్ యార్డును నిర్వహించుకోవాలని దానికి తగిన సహాయ సహకారాలను తమ ట్రస్టు ద్వారా అందజేయగమని తెలిపారు. గ్రామ పరిశుభ్రత కొరకు అందరికి అవగాహన కలిగించటానికి విద్యార్థుల సహకార...