అన్నార్తులకు అన్నదానం

అన్నార్తులను, అభాగ్యులను, ఆనాధలను, ఆసారా లేని వయోవృద్దులను ఆదుకొని అక్కున చేర్చుకొని మానవ సేవే మాధవ సేవ అనే దానికి నిర్వచనం ఇస్తున్న ఎన్నో సేవా సంస్ధలు వారందరకి అభినందనలు.
ఇలాంటి సేవలు సమాజానికి అందిస్తున్న సంస్థలలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ,గుంటూరు ఒకటి. 
ఈ సేవా సంస్థ వారు వృద్దులకు, అనాధ పిల్లలకు ఆశ్రమం కల్పించి ఆసరాగా నిలుస్తున్నది. ఆకలితో ఉన్న అన్నార్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్నారు.  వీరు ఇంకా అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు కూడా బహు శ్రద్ధతో చేస్తున్నారు. 
వీరి ని ప్రోత్సహించే సదుద్దేశంతో మన  కొమల ట్రస్ట్ వారు కళ్ళం హరినాధ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజి యన్. యస్. యస్. విభాగం విద్యార్దుల సహకారంతో 16, పిభ్రవరి 2020 న ఆదివారం వారి ఆశ్రమంలో నివసిస్తున్న వృద్దులకు, విద్యార్థులకు అన్న దానం చేసారు.

ఈ సేవా కార్య్రక్రమం లో కొమల ట్రస్ట్ అద్యక్షులు ఆచార్య కొడాలి శ్రీనివాస్ పాల్గోని అమ్మ ఆశ్రమ నిర్వాకులను అభినందించి  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు విరాళం అందజేసారు. 

ఈ కార్యక్రమంలో NSS. కోర్డినేటర్ ఆర్. శ్రీనివాసులు, పున్నారెడ్డి విద్యార్దులు శ్రీచరణ్, సాయిచందు తదితరులు పాల్గోన్నారు. విద్యార్థులలో సేవా భావం, మానవీయ విలువలు పెపొందేలా ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు దాతల సహాయ సాకారాలతో  ట్రస్టు ద్వారా చేపట్టాలని నిర్ణయించాము. 






Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

కొడాలి వారి వంశ వృక్షం