మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు
ప్రజా వైద్యుడు .సత్తెనపల్లి పరిసర ప్రజలకు దాదాపు నాలుగు దశాబ్దాలు విశేష వైద్య సేవలు అందించిన మానవతావాది ఆదర్శమూర్తి డాక్టర్ కొడాలి రంగారావు. డాక్టర్ రంగారావు గారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో కొడాలి వెంకట్రామయ్య, లక్ష్మి నరసమ్మ దంపతులకు 1938 ఏప్రిల్ 22న జన్మించారు. వీరికి గోపాల కృష్ణయ్య, మల్లిఖార్జున రావు అనే ఇద్దరు అన్నలు,ధన లక్ష్మీ అనే అక్కయ్య ఉన్నారు. రంగారావు గారి హైస్కూల్ విద్య తురిమెళ్ళ లోను,PUC గుంటూరు హిందూ కాలేజీ లోను, వైద్య విద్య MBBS ను మణిపాల్ కే.ఎం.సి కళాశాల లో చదివారు. 1961 లో తన సోదరి గోగినేని ధనలక్ష్మి,దేవయ్య గార్ల కుమార్తె ఉమాదేవిని వివాహం చేసుకున్నారు. వామ పక్ష భావాలు గల రంగారావు గారు రోగుల పట్ల చాలా ఉదారంగా ఉండేవారు. తొలుత తెనాలిలో డాక్టర్ కుర్రా వీరరాఘవయ్య, డాక్టర్ కొడాలి వీరయ్య చౌదరి గార్ల వద్ద కొద్ది కాలం వైద్యునిగా పనిచేసి నైపుణ్యం గడించారు. ఆ తరువాత వైద్య సదుపాయాలు ఏమాత్రం లేని గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి అనే గ్రామీణ ప్రాతంలో 1962 లో తొలి ప్రజా వైద్య శాల "నాగార్జున నర్సింగ్ హోమ్" ను స్థాపించి వెనకబడిన పలనాటి గ్రా...