కోవిడ్ -19 పై అవగహన సదస్సు
కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు ది. 16- 09- 2020 న ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామం లో కరోనా వ్యాధి నియంత్రణ జాగ్రత్తల గురించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామ వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు, హరిత హారం లో పనిచేసే కూలీలకు శ్రీ సోమేపల్లి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు అందించిన మాస్కులు మరియు శానిటైజర్లు ను కొమల ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి కొల్లా రత్న కుమారి గారు పంపిణి చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి కరోనా గురించిన అవగాహన కల్పించారు. రోజురోజుకి గ్రామీణ ప్రాంతాలలో తీవ్ర రూపు దాల్చుతున్న ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతివారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సురక్షితమైన దూరాన్ని వ్యక్తులమధ్య పాటించాలని, తరుచు చేతులు శుభ్రం చేసుకోవాలని, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పోష్టికాహారం తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని పెపొందించుకోవాలని రత్న కుమారి అందరిని కోరారు. ప్రజలలో నిర్లక్ష్యం వల్లే ఈ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుందని, అప్రమత్తం గా ఉంటే దాన్ని అరికట్టవచ్చు అని కొమల ట్రస్ట్ వీరన్నపాలెం కన్వీనర్ శ్రీ గోరంట్ల రాఘవేంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సోమేపల్లి శ్రీనివాసు దంపతులను కొమల ట్రస్ట్ ఛైర్మెన్ కొడాలి శ్రీనివాస్ గారు అబినందించారు.
కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి కోమల చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి కొడాలి రాగీణి గారు నిత్యావసర వస్తువులను అందజేశారు.
Comments
Post a Comment