Posts

Showing posts from October, 2016

దంత వైద్య శిబిరం- 15-10 - 2016

Image
కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, వీరన్నపాలెం గ్రామంలో ది. 15- 10 -2016 న శ్రీ నవ్యభారత్ పాఠశాల ఆవరణలో జరిగిన ఉచిత దంత వైద్య శిబిరానికి సంబంధించిన ఛాయా చిత్రాలు. సిబార్ వైద్య కళాశాల చైర్మన్ డా. యల్ . సుబ్బారావు , డా. మువ్వా సురేష్ బాబు  ల తో ట్రస్ట్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు    దంత సంరక్షణకు తీసుకోవాలిసిన ముందు జాగ్రత్తలను గురించి దంత వ్యాధుల గురించి  విపులంగా వివరించుతున్న డాక్టర్ రావూరి శ్రీనివాస్ 

కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో దంత వైద్య శిబిరం

Image
కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం,  వీరన్నపాలెం గ్రామంలో ది. 15- 10 -2016 న శ్రీ నవ్యభారత్ పాఠశాల ఆవరణలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది. ముందుగా జరిగిన ట్రస్ట్ ఆవిర్భావ సదస్సును   సిబార్ దంత వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి సమాజ సేవకు కంకణం కట్టుకున్న కోమల ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మెన్ కొడాలి శ్రీనివాస్ ను అభినందించారు.  శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సిబార్ దంత కళాశాల వైద్యులు   డాక్టర్ మువ్వా సురేష్ బాబు, డా. మువ్వా శ్రీదేవి, డా. అప్పయ్య చౌదరి, గ్రామ సర్పంచ్ మక్కెన శేఖర్ బాబు, కొడాలి వినయ్ కుమార్, పైమరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నెగంటి కుమారస్వామి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టి.శ్రీనివాస్, ట్రస్ట్ కార్యదర్శి గోరంట్ల రాఘవేంద్రరావు పాల్గొన్నారు.  డా. రావూరి శ్రీనివాస్ గారు  దంత సంరక్షణకు తీసుకోవాలిసిన ముందు జాగ్రత్తలను గురించి వ్యాధుల గురించి అవగా...

అందరికి ఆహ్వానం

Image
కీర్తి శేషులు కొడాలి మల్లిఖార్జున రావు గారి ప్రధమ వర్ధంతి ది.   14 అక్టోబర్ 2016   న వీరన్నపాలెంలో మా స్వగృహం లో జరుగుతుంది.  ఈ సందర్బంగా వీరన్న పాలెం గ్రామంలో ది. 15 అక్టోబర్ 2016 న "కొడాలి మల్లిఖార్జున రావు లక్ష్మిదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్   (KOMALA CHARITABLE TRUST - Reg. 50/2016 )" ఆవిర్బవ సదస్సు మరియు    ఉచిత  దంత వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నారు. S.B.N. హైస్కూల్ ఆవరణలో జరిగే కార్యక్రమం లో  గుంటూరులో ఉన్న సిబార్ డెంటల్ కళాశాల మరియు హాస్పిటల్ వారు వైద్య సేవలు అందజేస్తున్నారు. డాక్టర్ మువ్వా సురేష్ బాబు గారి సారధ్యంలో సిబార్ దంత వైద్యులు రోగులను పరీక్షించి తగిన చికిత్స చేస్తారు. ఈ వైద్య శిభిరంలో కోమల చారిటబుల్ ట్రస్ట్ వారు  అవసరమైన మందులను  రోగులకు ఉచితంగా పంపిణి చేస్తారు. అందరికి ఆహ్వానం, సుస్వాగతం.      ఈనాడు-14-09-2016 ఆంధ్ర జ్యోతి -14-09-2016

కర్మ యోగి మల్లిఖార్జున రావు-3

Image
స్ఫూర్తి ప్రధాత - 3 రెండవ భాగం తరువాయి  చదువుల ప్రేముకుడు  విద్య వివేకాన్ని, వివేకం వికాసాన్ని ప్రసాదిస్తే ఆ విద్య సరైన విద్య. అవిద్య అజ్ఞానానికి దారి తీస్తుంది. అజ్ఞానం అనారోగ్యానికి, అనైక్యతకు బాటలు వేస్తుంది. ఇవి ప్రబిలితే సమాజపఠనం అవుతుంది. ఆనందాభివృద్ది అందించే విద్యాబోధన జరగాలంటే అంకితభావం గల మంచి బోధకులు విద్యాలయాలలో ఉండాలి . విద్యార్థిని కేంద్రంగా చేసుకొని విద్యనందించే విధానం ఉండాలి. పిల్లలకు తెలవని/రాని విషయాలు తిరిగి లాలింపుగా నేర్పించాలే కానీ వాళ్ళను కఠినంగా దండించరాదు. విద్యార్థి చదువులో వెనకబడి ఉంటె లోపం ప్రధానంగా చదువు నేర్పే ఉపాధ్యాయుడిదే. అలాగే తల్లిదండ్రులు పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొలంలో విత్తనాలు చల్లినంతనే పంట చేతికి రాదుకదా!ఎప్పటికప్పుడు పైరును సంరక్షించితేనే పంట దిగుబడి బాగుంటుంది. ఇదే సూత్రం చదువుకి వర్తిస్తుంది. ఆస్తిపాస్తుల కంటే చదువు చాలా విలువైనది. ఆస్తులు అమ్మిఅయినా పిల్లలను బాగా చదివించాలి. అలాగే చదువుతో పాటు సంస్కారం రెండు పిల్లలకు అబ్బాలి.   చదువుల బడి అమ్మ వడి ఒకటే అని భావించాలి....

కర్మ యోగి మల్లిఖార్జున రావు -2

Image
స్ఫూర్తి ప్రధాత - 2 మొదటి భాగం తరువాయి   గ్రంధాలయం మల్లిఖార్జునరావు   -2014 పుస్తకం హస్త భూషణం అనే నినాదంతో స్వాతంత్ర పోరాటాంలో భాగంగా గ్రామ గ్రామాన ఒక గ్రంధాలయం ఉండాలనే గ్రంధాలయోద్యమ కార్యక్రమం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మల్లిఖార్జున రావు.  జ్ఞాన సముపార్జనకు గ్రంధాలయాలు ఇతోధికంగా దోహదపడతాయని, గ్రంధాలయం సరస్వతిదేవి ఆలయమని  నమ్మిన మల్లిఖార్జునరావు వీరన్నపాలెం లో " గోరంట్ల సత్తన్న మెమోరియల్ గ్రంధాలయం " పేరుతో   తన ఇంటిలో ఒక గ్రంధాలయాన్ని  కొంతకాలం పాటు  స్వయంగా నిర్వహించాడు. దీని నిర్వహణకు కావలిసిన ఆర్థిక సహాయం  సత్తన్న కుంట మాన్యం భూములనుండి లభించేది. ఆ ఆదాయంతో ఒక శాశ్విత భవనాన్ని నిర్మించి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆశించాడు. ఆ తరువాత గోరంట్ల సత్తన్న గారి వారసులు/ బంధువులు మన్యం భూములను పంచుకొని 1962 లో గ్రంథాలయాన్ని మూసివేశారు. మల్లిఖార్జునరావు ఆ తరువాత ఆ గ్రంధాలయం సంబంధించిన పుస్తకాలను గ్రామంలో ఉన్న నవ్యభారత పాఠశాల గ్రంథాలయానికి అందచేసారు.  పుస్తకాలు అంటే మల్లిఖార్జున రావుకి వల్లమా...

కర్మ యోగి మల్లిఖార్జున రావు -1

Image
స్ఫూర్తి ప్రధాత - 1 ఈ విశాల లోకంలోకి అనేక మంది  వ్యక్తులు  వస్తారు అలాగే నిష్కక్రమిస్తారు, వారిలో తన కొరకు తన కుటుంబ హితం కొరకు జీవించివారు కొందరైతే  మరి కొందరు మాత్రమే కుటుంబ హితంతో పాటు సమాజహితం  కొరకు పరి తపించేవారు ఉంటారు. అలాంటి ఉన్నత భావజాలం పుష్కలంగా ఉన్న కర్మయోగి కొడాలి మల్లిఖార్జున రావు.   జనజీవన స్రవంతిలో  మనుగడ సాగించే మందలో ఒకరిలా కాక వందనాలు అందుకునే వందమంది వదాన్యులలో  ఒకరిలా జీవించిన ఆదర్శ మూర్తి , త్యాగ ధనుడు, నిష్కామ యోగి .  మల్లిఖారున రావు -1950 గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలో అమృతలూరు మండలం, మోపర్రు గ్రామంలో  కొడాలి వెంకట్రామయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు రెండవ సంతానంగా మల్లిఖార్జునరావు గారు 1930 లో జన్మించారు. మధ్య తరగతి వ్యవసాయ కుటుంభంలో జన్మించిన మల్లిఖార్జునకు అన్న గోపాల కృష్ణ, చెల్లి ధనమ్మ, తమ్ముడు Dr. రంగారావు తోడబుట్టిన వారు.  మల్లిఖార్జుని బాల్యం మోపర్రు తో పాటు అమ్మమ్మ గారి ఊరు పెదరావూరులో గడిచింది. తన అమ్మమ్మ (పాలడుగు వె...